Pooja Hegde: ఆడిష‌న్‌కు వెళ్తే న‌న్ను తీసుకోలేదు: పూజా హేగ్డే 6 d ago

featured-image

 తాను ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ఆడిషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటానని పూజా హెగ్డే చెప్పారు. ఇటీవల తాను ఓ తమిళ సినిమా కోసం ఆడిషన్ కు వెళ్లాన‌ని ఆమె ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ, ఆ పాత్రకు త‌న‌ వయసు చాలా చిన్నదని భావించి తిరస్కరించార‌ని గుర్తుచేసుకున్నారు. ఆ పాత్ర‌కు తన కంటే పెద్ద నటిని తీసుకున్నార‌ని చెప్పారు. సినిమాను అంగీకరించిన తర్వాత ఆ పాత్రకు సరిపోలేదని వద్దు అని అనుకోవ‌డం కంటే.. ఆడిషన్ చేయడం ముఖ్యమ‌ని ఆమె తెలిపారు. పూజా ప్రస్తుతం 'రెట్రో'లో నటిస్తున్నారు. సూర్య హీరోగా కార్తిక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్న చిత్రమిది. మే1న అభిమానుల ముందుకురానుంది

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD